పాలమూరు : పహల్గామ్లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్( VHP ) ,భజరంగ్ దళ్ ( Bajrangdal ) పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని తెలంగాణ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ (Terrorists Effigy) దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ కేవలం హిందువులపై మారణహోమాన్ని సభ్యసమాజం ఖండించాలన్నారు.
ప్రతీ హిందువు మేల్కొని సంఘటితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగరాజు , నగర కార్యదర్శి డి.కె. ఆంజనేయులు , నగర అధ్యక్షుడు విఘ్నేష్ , హనుమంత్ , రాచాల జనార్దన్ , గోద్రెజ్ సత్యం, నగర సహ కార్యదర్శి శ్రీశైలం , భజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ వంశీ , సహ సంయోజక్ కుమార్, నగర సంయోజక్ ఛత్రపతి , శ్రావణ్ , కొండల్, తదితరులు పాల్గొన్నారు.