ఆదిలాబాద్ : తోటి సిబ్బంది నుంచి లంచం తీసుకుంటూ వెటర్నరీ వైద్యుడు(Veterinary doctor)ఏసీబీకి (CB)పట్టుబడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉట్నూరు మండలం వెటర్నరీ వైద్యుడిగా పనిచేస్తున్న రమేష్ రాథోడ్ తన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పని కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఉట్నూర్ మండలంలోని షాంపూర్ సబ్ సెంటర్లో వెటర్నరీ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జుగునాక మాధవ్ ఇటీవల వేరే ప్రాంతానికి బదిలీ అయ్యాడు.
మాధవ్‌కు సంబంధించిన రెండు నెలల వేతనం పెండింగ్‌లో ఉంది. వేతనం మంజూరు విషయమై మాధవ్ తన పై అధికారి రమేష్ రాథోడ్‌ను సంప్రదించాడు. అందుకు రూ.30 వేలు డిమాండ్ చేయగా రూ.15వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం షాంపూర్ సబ్ సెంటర్లో రూ.15 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.