TSPSC | హైదరాబాద్ : ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
15వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జీఎస్ పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సబ్జెక్టు పరీక్ష నిర్వహించనున్నారు. 16వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా సబ్జెక్టు పరీక్ష నిర్వహించనున్నారు. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. తదితర వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.