Medical Courses | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్, తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ సంయుక్తాధ్వర్యంలో ఎస్సీ యువతకు పలు మెడికల్ కోర్సుల్లో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను సోమవారం నిర్వహించనున్నారు. ప్రాజెక్టు మేనేజర్ సైదులు శనివారం ప్రకటన విడుదల చేశారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ఫిజియోథెరపి టెక్నిషియన్, అసిస్టెంట్ డయాలసిస్ టెక్నిషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో కొనసాగనున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు నేరుగా సంబంధిత విద్యార్హత పత్రాలతో రావాలని సూచించారు. వివరాలకు 9848 581100, 9704782992లలో సంప్రదించాలని సూచించారు.
నేడు గ్రూప్-4 స్పోర్ట్స్ అభ్యర్థుల వెరిఫికేషన్
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్-4 క్రీడా కోటా అభ్యర్థులకు సోమవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. నాంపల్లిలోని శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నది. షార్ట్ లిస్టులోని అభ్యర్థుల్లో ఎవరికైనా సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోతే రిజర్వు డే అయిన మంగళవారం వెరిఫికేషన్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నది.