బాసర, జూన్ 23 : ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్, పీహెచ్సీ కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 26, 27వ తేదీల్లో పరిశీలించనున్నట్టు ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
26న క్యాప్ (సీఏపీ), పీహెచ్సీ.. 27న స్పోర్ట్స్, ఎన్సీసీ, విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న క్యాంపస్‌కు హాజరు కావాలని సూచించారు. ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేస్తామని తెలిపారు. మిగిలిన జనరల్ కోటా అభ్యర్థుల తుది జాబితా జూలై 4న విడుదల చేస్తామని, జూలై 7 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.