హైదరాబాద్, కొడంగల్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): లగచర్ల ఘటనపై బొంరాస్‌పేట పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ 3 కేసుల్లో కేవలం తేదీలు తప్ప విషయం మాత్రం ఒక్కటేనని, ఆ ఎఫ్ఐఆర్లలో కొత్త విషయం ఏమీలేదని జస్టిస్ కే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఒకే అంశంపై 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేయడంలో ఆం తర్యం ఏమిటని పోలీసులను ప్రశ్నించా రు. ఫిర్యాదులను ఎమ్మార్వో, డీఎస్పీ రాసివ్వకుండా పోలీస్ స్టేషన్‌లోని రైట ర్ పేరుతో రాయడం ఏమిటని నిలదీశా రు. రైటర్ కూడా విచక్షణ లేకుండా అ ప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ను కాపీ కొట్టి మరో 2 కేసులను నమోదు చేయ డం దారుణమని ఆగ్రహం వ్యక్తం చే స్తూ.. ఏ నిబంధన కింద బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
పట్నం బెయిల్ పిటిషన్
లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసులు తనపై నమోదు చేసిన ఓ కేసు (ఎఫ్ఐఆర్ 154)లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పట్నం నరేందర్‌రెడ్డి హై కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష తో కుట్రపూరితంగా ఈ కేసు నమోదు చేశారని పేరొన్నారు. లగచర్ల రైతుల ఆగ్రహం వెనుక నరేందర్‌రెడ్డి పాత్ర ఉ న్నదని ఆరోపిస్తూ ఆయనపై బొంరాస్‌పేట పోలీసులు కేసు (ఎఫ్ఐఆర్ 153) నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేయడంతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఇదే ఘటనలో ఇతరుల ఫిర్యాదు ఆధారంగా ఆయనపై మరో రెండు కేసులు నమోదు చేశారు. ‘కడా’ ప్రత్యేకాధికారితో ఎన్‌హెచ్చార్సీ భేటీ