హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తేతెలంగాణ) : ఎల్టీ క్యాటగిరిలో ఫిక్స్డ్ చార్జీలు, హెచ్‌టీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఇతరత్రా అంశాలపై ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు. గృహజ్యోతి, రెవెన్యూలోటు, ప్రభుత్వ అనుమతులను సాకు గా చూపుతూ ఏడున్నర నెలల ఆలస్యంగా 18న ప్రతిపాదనలు సమర్పించాయని పేర్కొంటున్నారు. అక్టోబర్ 1లోగా తుది నిర్ణయం తీసుకొని టారిఫ్‌లు నిర్ణయించాలని అభ్యర్థించాయి.
డిస్కంల ప్రతిపాదనలపై అక్టోబర్ 20న షెడ్యూల్, 23, 24 తేదీల్లో పబ్లిక్ హియరింగ్ పూర్తిచేయాలని నిర్ణయించింది. నవంబర్ 11న తుది ప్రతిపాదనలు రూ పొందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆరు పిటిషన్లపై విచారణ చేపట్టాల్సి ఉంటుంది. పబ్లిక్ హియరింగ్‌కు కనీసం 15 రోజులు అవసరం. దీని ప్రభావంతో భవిష్యత్తులో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉం టుందని వేణుగోపాల్‌రావు చెప్పారు.