హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-2 ఫలితాలు, జీఆర్‌ఎల్‌ను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. 447.088 మార్కులతో నారు వెంకట హరవర్ధన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వడ్లకొండ సచిన్ 444.754 మార్కులతో రెండో ర్యాంకు, 439.344 మార్కులతో బీ మనోహర్‌రావు మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో మహిళలతో పోల్చితే, పురుషులు సత్తాచాటారు. మొదటి 31 మంది టాపర్లు పురుషులు కాగా, 32వ ర్యాంకును మహిళా అభ్యర్థి వినీషారెడ్డి దక్కించుకున్నారు. మొదటి 500 ర్యాంకుల్లో మహిళలు 48 మందే ఉన్నారు. ఓ అభ్యర్థికి సున్నా మార్కులొచ్చాయి. కనిష్ఠంగా ఓ అభ్యర్థి 14.193, మరో అభ్యర్థి 19.246 మార్కులు సొంతం చేసుకున్నారు.