హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్‌ను వేములవాడ అనువంశిక అర్చకులు కోరారు. మంగళవారం బొగ్గులకుంటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతోకలిసి వినతిపత్రం సమర్పించారు.
వేములవాడ అనువంశిక అర్చక హక్కుల పునరుద్ధ్దరణ, ఆలయ సంప్రదాయ పరిరక్షణ, అర్చక కుటుంబాల సమస్యలు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. చైర్మన్‌ను కలిసిన వారిలో బ్రాహ్మణ పెద్దలు ఉపాధ్యాయుల సాంబన్న, వొజ్జల సతీశ్, దీవన్నగారి శిరీశ్, వాసాలమర్రి నాగరాజు, వొజ్జల శ్యామ్, వొజ్జల వేణు తదితరులు ఉన్నారు.