హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి వాడుతున్న అసభ్య పదజాలంపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీలో చర్చించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎథిక్స్ కమిటీ సభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముందు ఎథిక్స్ కమిటీకి ఎథిక్స్ ఉండాలని, కేవలం కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యల అంశాన్ని కమిటీ ఎజెండాలో చేర్చడం సరికాదని పేర్కొన్నారు. అసెంబ్లీలో అనుచితంగా మాట్లాడిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో సీనియర్ సభ్యుడు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పాడి కౌశిక్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై అసెంబ్లీలోని కమిటీ హాల్లో చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ శనివారం సమావేశమైంది.
బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల సభ్యులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ తరఫున మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. కమిటీ సమావేశం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వేముల ప్రశాంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై వివాదం జరిగిన రోజు 23మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడించారని తెలిపారు.
వారి అభిప్రాయాలను మాత్రమే ఆధారంగా తీసుకుని ‘మూడ్ ఆఫ్ ది హౌస్’గా పేరొనడం సరికాదని చెప్పారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కౌశిక్‌రెడ్డి ఏమీ అనలేదని బీజేపీ సభ్యులు కూడా ఎథిక్స్ కమిటీ సమావేశంలో చెప్పారని పేరొన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయాలనే ప్రాతిపదికగా అంశాన్ని ఎథిక్స్ కమిటీ ఎజెండాలో చేర్చడం ఏకపక్ష నిర్ణయంగా కనిపిస్తున్నదని చెప్పారు.
కేవలం హావభావాలు లేదా వ్యాఖ్యల ఆధారంగా ఎథిక్స్ కమిటీకి పిలిస్తే, అసెంబ్లీలో నేరుగా అనుచితంగా మాట్లాడిన, ప్రవర్తించిన అధికార పార్టీ సభ్యులను కూడా ఒకే ప్రమాణంతో విచారించాలని వేముల డిమాండ్ చేశా రు. తప్పు చేసినట్టు తేలితే వారిపై కూడా చర్య లు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వీర్లపల్లి శంకర్, మందుల సామే లు సభలో అనుచితంగా మాట్లాడటం, ప్రవర్తించిన అంశాలపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆయా సందర్భాల్లో వారు మాట్లాడిన వీడియోలను కూడా కమిటీకి సమర్పించామని చెప్పారు.
కౌశిక్‌రెడ్డికి తన వాదనను వినిపించే అవకాశం కల్పించాలని ఎథిక్స్ కమిటీ చైర్మన్‌ను కోరినట్టు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలా? వ్యక్తిగతంగా హాజరై తన అభిప్రాయం చెప్పాలా? అనే అంశంపై చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
గత ప్రభుత్వంలోని అన్ని పథకాలు కొనసాగుతున్నాయని, కొత్త పథకాలు కూడా అమలుచేస్తున్నామని, ప్రజలంతా సంతోషం గా ఉన్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పడంపైనా ప్రశాంత్‌రెడ్డి అ భ్యంతరం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్క డ కొనసాగిస్తున్నదో చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై తాము రెండేండ్లుగా చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఒకొకటిగా నిజమవుతున్నాయని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వంలోని లోపాలను కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ముఖంగా బహిరంగంగా వెల్లడిస్తున్నారని చెప్పారు. 22ఏ భూముల అంశాన్ని ప్రశాంత్‌రెడ్డి ప్రస్తావిస్తూ ‘మేము 22ఏను తీసుకొచ్చి ఉంటే అప్పుడెందుకు ఎలాంటి లొల్లి జరుగలేదు? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది?’ అని ప్రశ్నించారు.