మొయినాబాద్, ఫిబ్రవరి 18: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కోర్టు అనుమతితో మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి విచారించగా సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రామరాజ్యం స్థాపించాలనే ఆలోచనతో ఈ కార్యానికి పూనుకున్నానని వీరరాఘవరెడ్డి వెల్లడించినట్టు సమాచారం . కోసెలేంద్ర ట్రస్టు ద్వారా నిధుల సేకరణ చేసి సైన్యంలో చేరిన వారికి వేతనాలు చెల్లించడానికి ప్రణాళిక రూపొందిచినట్టు నిందితుడు పేర్కొన్నట్టు తెలిసింది. మరో రెండు రోజుల పాటు విచారణ చేపట్టనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.