Veena Vani | దంతాలపల్లి, అక్టోబర్ 16 : అవిభక్త కవలలు వీణ-వాణి గురువారం 23వ వసంతంలోకి ప్రవేశించారు. 2003 అక్టోబర్ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో తలల అతుక్కొని కవలలుగా జన్మించారు. మహబుబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన మారగాని మురళి-నాగలక్ష్మి దం ప తులకు నలుగురు కుమార్తెలు.
మొదటి కుమార్తె బిందు కాగా, రెండో సంతానంలో వీణ-వాణి జన్మించారు. నాలుగో సం తానంలో సింధు జన్మించింది. ఈ కవలల శస్త్రచికిత్స కోసం గత ప్రభుత్వాలు వివిధ దేశాలు, రాష్ర్టాలు తిప్పినా ఫలితం లేకుం డా పోయింది. ప్రస్తుతం వీరు హైదరా బాద్లోని చిల్డ్రన్హోమ్లో ఉంటూ బీకాం పూర్తిచేశారు. చార్టెడ్ ఎకౌంటెంట్ట్స్ కావాలనే లక్ష్యంతో చదువుతున్నారు.
మా అవిభక్త కవలలు వీణ-వాణి పెద్దవాళ్లు అవుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. పిల్లలతో కలిసి ఉండేలా ప్రభుత్వం ఉపాధి కల్పించాలి.
– వీణ-వాణి తల్లిదండ్రులు