Viral Video | హైదరాబాద్ : ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియాలో మునిగి తేలుతోంది. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారాలన్న లక్ష్యంతో యువత ఎన్నో వినూత్న ప్రయోగాలకు పాల్పడుతున్నారు. అలా కొన్ని ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. కొన్నేమో రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేస్తున్నాయి. ఇదంతా ఒకరిని చూసి మరొకరు తమకు నచ్చిన రీతిలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఓ బాలుడు కూడా అతి వేగంగా బైక్ నడిపి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. లైక్లు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి అని సజ్జనార్ సూచించారు.
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. లైక్లు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. pic.twitter.com/JnvEoEkRma
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 9, 2024