హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఉద్యానరంగం అభివృద్ధికి ఒక ప్రణాళిక అవసరమని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దండా రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభ్యుదయ రైతులు, ఎఫ్‌పీవోలు(ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజర్స్), వ్యవసాయ-వ్యాపార సంస్థలు, ఎగుమతి, సరఫరాదారులు, పరిశోధన నిపుణులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మార్కెట్ పోకడలు, పంటల వైవిధ్యం, ఎఫ్‌పీవోల సామర్థ్యం, వ్యవసాయ సాంకేతిక ఏకీకరణ, పంటల నిర్వహణ, ఎగుమతి అవకాశాలు, పరిశ్రమ ఆధారిత ఇన్పుట్, ప్రాసెసింగ్ పరిష్కారాలు తదితర అంశాలపై చర్చించారు. ఎఫ్‌పీవోలను మారెట్లతో అనుసంధానించడంలో డిజిటల్ ప్లాట్ పాత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, ములనూర్ కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్‌రెడ్డి, అప్పారావు, డీన్ ఆఫ్ హార్టికల్చర్ చీనానాయక్, డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సురేశ్‌కుమార్, యూనివర్సిటీ లైబ్రేరియన్ రాజశేఖర్, టెక్నికల్ ఆఫీసర్ వీణాజోషి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సతీశ్ పాల్గొన్నారు.