హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. బాంబే ఐఐటీ ఓపెన్-సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ ఎడ్యుకేషన్(ఫోసీ-జీఐఎస్) ప్రాజెక్ట్ క్యాటగిరీలో ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డును అందజేసింది. జియోస్పేషియల్ ఉపయోగాలు, క్రియాశీల భాగస్వామ్యం గురించి అవగాహన కల్పించడంలో ఉద్యాన విశ్వవిద్యాలయం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులకుగాను అవార్డు వరించింది.
కేంద్ర విద్యాశాఖ ద్వారా జాతీయ మిషన్ (ఎన్ఎంఈఐసీటీ) ఆధ్వర్యంలో ఫాస్సీ ప్రాజెక్ట్ నేషనల్ జియోస్పేషియల్ అవార్డ్స్ 2025 (ఎడిషన్02)లో భాగంగా ఐఐటీ బాంబే ఈ అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం ఐఐటీ బాంబేలో జరిగిన ఓపెన్-సోర్స్ జీఐఎస్ దినోత్సవంలో ఈ అవార్డును వర్సిటీ వీసీ డాక్టర్ డీ రాజిరెడ్డి అందుకున్నారు. కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్ తదితరులు పాల్గొన్నారు