RRR | వలిగొండ, సెప్టెంబర్ 26 : తమకు న్యాయం చేయాలని కోరుతూ యాదా ద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండ లం వర్కట్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని ట్రిపుల్ ఆర్ బాధితులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా రైతులు నాగెల్లి దశరథ, సోలిపురం జనార్దన్‌రెడ్డి, మెట్టు రవీందర్‌రెడ్డి, నాగెల్లి సత్యనారాయణ, మాడ్గు ల వెంకటేశ్ తదితరులు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణంలో చిన్న, సన్నకారు రైతులు, ఎకరం, రెండు, మూడు ఎకరాల భూములున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారని, ఈ భూములను కోల్పోతే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మొదట నిర్ణయించిన అలైన్మెంట్ కాకుండా రెండో అలైన్‌మెంట్‌తోనే రైతుల భూములు ఎక్కువగా పోతున్నాయని పేర్కొన్నారు. మొదటి అలైన్మెంట్ ప్రకారం భూసేకరణ చేయాలని, రెండో అలైన్మెంట్ ప్రకారం భూసేకరణ చేస్తే మార్కెట్ ధరకు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.