Warangal | వరంగల్ : వర్ధన్నపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్కు పెను ప్రమాదం తప్పింది. కారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా, అదుపుతప్పి ఆకేరు వాగులోకి దూసుకెళ్లింది. వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే కారు ప్రమాదానికి గురైన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎస్ఐ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారు ధ్వంసం కాగా, ఎస్ఐ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఎస్ఐని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారును వాగులో నుంచి బయటకు తీశారు.