హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : టీజీ జెన్కో సీఎండీగా నియమితులైన ఐఏఎస్ అధికారి ఎస్ హరీశ్‌ను విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీఏవోఏటీ) ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం విద్యుత్తు సౌధలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య, ఉపాధ్యక్షుడు నాజర్ షరీఫ్, వీ పరమేశ్, స్వామి, పీ అనిల్, కొరడాల వెంకటేశ్వర్లు, మధుసూదన్, రామారావు, రాజశేఖర్, అపర్ణ తదితరులు సీఎండీని కలిసిన వారిలో ఉన్నారు.