మెదక్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తూప్రాన్ పట్టణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే వందల కోట్లతో తూప్రాన్ అభివృద్ధి జరిగిందని తెలిపారు.
తూప్రాన్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో గులాబీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. కేసీఆర్ తూప్రాన్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు తూప్రాన్ అభివృద్ధి కోసం అన్నివేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.