జనగామ టౌన్, ఏప్రిల్ 22 : కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్లే కాదు అర్ధరాత్రి భారీ క్రేన్ సహాయంతో అధికారులు అరాచకం సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. జనగామలోని కలెక్టరేట్‌కు సమీపంలో ఇంది రా మహిళాశక్తి పథకంలో గత కలెక్టర్ షేక్‌రిజ్వాన్ బాషా ప్రారంభించిన వనిత టీస్టాల్, విజయ మిల్క్పార్లర్ను ప్రస్తుత కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు మంగళవా రం అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు బలవంతంగా తొలగించినట్టు బాధితులు పాలమాకుల చిన్న మంజుల, పొత్కనూరి విజయలక్ష్మి తెలిపారు.
వనిత టీస్టాల్, విజయ మిల్క్ పార్ల ర్ స్థల వివాదంపై నెల రోజులుగా హైకోర్టులో కేసు నడుస్తుండగా, బాధితుల ఉపాధి దెబ్బతినకుండా మరోచోట వ్యాపారం నిర్వహించుకునేలా 15 రోజుల్లో (మే 1లోపు) అనువై న ప్రాంతాన్ని చూపాలని అధికారులకు ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 20, 21న నోటీసులు అతికించిన అధికారులు మంగళవారం అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా డబ్బాలను తొలగించారు. బాధితులకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్, సీపీఎం కౌన్సిలర్లు సువార్త, జ్యోతి, సీపీఎం నేతలు, హైకో ర్టు న్యాయవాది, దళిత, గిరిజన, బహుజన ప్రజా సంఘాల నాయకులు బాధితులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.