హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్య విద్యాశాఖ ఇన్చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ ఎన్ వాణీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు మెడికల్ ఎడ్యుకేషన్ (అడ్మిన్) ఇన్చార్జి డైరెక్టర్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ త్రివేణి స్థానంలో వాణీ నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డాక్టర్ వాణీ ఇన్చార్జి బాధ్యతలలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.