హైదరాబాద్ : పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం కల్పిత కథలతో మధ్యంతర బడ్జెట్‌ను(Central budget) ప్రవేశపెట్టిందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్(Vanam Sudhakar) ఆరోపించారు. శుక్రవారం మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్లో గల ఎంసిపిఐ(యు) కార్యాలయం మీడియాతో మాట్లాడారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్‌గా బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో 47,65,768 కోట్ల రూపాయలతో దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ బడ్జెట్ లో దేశ అభివృద్ధి కాకుండా వివిధ రంగాల కేటాయించిన నిధులు కల్పిత కథలతో ఉన్నాయని ఆరోపించారు.
బడ్జెట్ సంపదను గతంలాగానే కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా ఆయా పెట్టుబడిదారీ రంగాలకు భారీ నిధులు కేటాయించిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో సమూలమైన మార్పు కోసం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్‌ను రూపొందించాలని డిమాండ్ చేశారు.