హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గట్టు వామన్‌రావు దంపతుల (న్యాయవాదులు) హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్కే సింగ్‌ల ధర్మాసనం.. పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
పాలకుర్తి, ఆగస్టు 12: ఆసరా పెన్షన్లు పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే అర్హత లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలో మాట్లాడారు.