హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ జాతీయస్థాయిలో రోల్ మాడల్‌గా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే చర్య అని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనను దేశానికి రోల్ మాడల్ అంటూ అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించారు. కులగణన నిబంధనల ప్రకారం చేయలేదని, ప్రణాళికశాఖ ద్వారా మాత్రమే నిర్వహించారని తెలిపారు. కులాలవారీగా లెకలను అధికారికంగా వెల్లడించలేదని పేర్కొన్నారు. బీసీ కమిషన్ నివేదిక బయటపెట్టకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అంటూ నిప్పులు చెరిగారు.