స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు.. హైటెక్స్‌లో 8న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. ఉత్సవాల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 29: (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. ఉత్సవాల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయడం, హైదరాబాద్‌లో ముఖ్యమైన భవనాలు, స్మారక చిహ్నాల వద్ద విద్యుత్తు దీపాలంకరణ, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్ర సమరయోధుల, జాతీయ నాయకుల చిత్రాలతో హోర్డింగ్‌లు, బిల్-బోర్డ్‌ల ప్రదర్శన, ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ, సినిమా హాళ్లలో, పాఠశాలల్లో, కళాశాలల్లో దేశభక్తి చిత్రాల ప్రదర్శన, జానపద పాటలు, నృత్యాలు చేయించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పరేడ్ నిర్వహించడంతోపాటు స్వాతంత్య్ర పోరాటంపై పెయింటింగ్, ప్రదర్శనలు -ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ట్యాంక్ బండ్‌పై అంబేదర్ విగ్రహం నుంచి విద్యార్థులతో ర్యాలీ, సంజీవయ్య పార్, జాతీయ జెండా స్తంభం వరకు జీహెచ్ఎంసీ సిబ్బందితో ర్యాలీ నిర్వహణపై చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీఎం వోఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఆగస్టు 8న సీఎం కేసీఆర్ హైటెక్స్‌లో వేడుకలను ప్రారంభించి, ప్రసంగిస్తారు. ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో ఏర్పాట్లను సమన్వయం చేస్తారు.
వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు
- త్రివర్ణ బెలూన్లను ఎగరవేయడానికి పెద్ద మైదానంలో సమ్మేళనం.
- స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ నేతల విగ్రహాలకు నివాళి అర్పిస్తూ పూలమాలల అలంకరణ.
- ప్రధాన జంక్షన్ల వద్ద జాతీయ గీతాలాపన చేయడం
- 2కే ఫ్రీడమ్ రన్, సైకిల్ రన్.
- దీప నీరాజనం- దీపాలను వెలిగించడం.
- జాతీయ సమైక్య రక్షా బంధన్ (రాఖీ పూర్ణిమ).
- కాలనీల శుభ్రత కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనుట.
- కవి సమ్మేళనం, ముషాయిరా.
- పొదుపు సంఘాల మహిళలతో రంగోలి, పుస్తక ప్రదర్శన.
- ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, సౌట్స్అండ్గైడ్స్, సైక్లింగ్ క్లబ్, ఎస్‌ఎస్‌జీలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొంటారు.
- వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఇతర క్రీడా పోటీలు.
- రవీంద్రభారతిలో 15 రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు.
- దవాఖానల్లో రోగులకు పండ్ల పంపిణీ. బీటింగ్ రిట్రీట్.
- ముగింపు కార్యక్రమంలో ప్రతి జిల్లా నుంచి 1000-2000 మంది వలంటీర్లు ర్యాలీగా ఎల్బీ స్టేడియానికి చేరుకొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

