భద్రాచలం: దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలంయలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ చంద్రుడు రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నారు. నిన్న పరశురామావతారంలో దర్శనమిచ్చిన రమయ్య తండ్రి.. ఏడో రోజైన నేడు నిజరూపమైన శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇక జనవరి 1న గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవం నిర్వహించనున్నారు. మరుసటి రోజున అంటే జనవరి 2న ముక్కోటి వైకుంఠ ఏకాదశి కావడంతో.. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు.