హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌తోపాటు హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ ఉమ్మడి జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఫారం-18 పూర్తి చేసి నవంబర్ 6వ తేదీలోగా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఓటు హక్కు పొందాలని బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.
2023 నాటికి డిగ్రీ లేదా దానికి సమానమైన డిప్లొమా పూర్తి చేసిన వారు ఓటు నమోదుకు అర్హులని తెలిపారు. గతంలో ఓటుహక్కు వినియోగించుకున్నవారు కూడా తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఇందుకుగాను ఓటరు గుర్తింపు, ఆధార్‌కార్డులతోపాటు డిగ్రీ/గ్రాడ్యుయేట్ ధ్రువీకరణపత్రం, పాస్‌పోర్ట్‌సైజు ఫొటో, మొబైల్ నంబర్‌తో ఓటుకు అప్లయ్ చేసుకోవాలని సూచించారు.