కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు
‘సరిపడా సాగునీరు.. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతుల కండ్లల్లో ఆనందం చూశారు. కానీ కాంగ్రెస్ పాలకులు ప్రాజెక్టుల్లో నీళ్లున్నా విడుదల చేయకుండా.. సక్రమంగా కరెంట్ ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారు’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ఉద్ఘాటించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఎమ్మెల్సీ తాతా మధు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
- పంటలు కొనాల్సివస్తుందనే సర్కార్ కుయుక్తులు
- కేసీఆర్ హయాంలో రైతుల కండ్లల్లో ఆనందం
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు
- పాలమూరుకు రేవంత్ ద్రోహం: ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘సరిపడా సాగునీరు.. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతుల కండ్లల్లో ఆనందం చూశారు. కానీ కాంగ్రెస్ పాలకులు ప్రాజెక్టుల్లో నీళ్లున్నా విడుదల చేయకుండా.. సక్రమంగా కరెంట్ ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారు’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ఉద్ఘాటించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఎమ్మెల్సీ తాతా మధు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రేజూరాల ప్రాజెక్ట్‌లో నీళ్లున్నా సాగుకు విడుదల చేయకపోవడంతో పంటలెండి రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. వారి నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు బయల్దేరిన బీఆర్ఎస్ నేతలను గృహనిర్బంధంలో ఉంచడం గర్హనీయమని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై గొంతెత్తుతున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని విరుచుకుపడ్డారు.
గోదావరి, కృష్ణా నదులకు వచ్చిన వరదను ఎత్తిపోయకుండా, చెరువులు నింపకుండా పంటపోలాలకు నీళ్లివ్వకుండా ఎండబెట్టడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. సీఎం రేవంత్ వైఖరి రైతాంగానికి శాపంగా మారిందని వాపోయారు. పొలాలకు నీరందిస్తే రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి వారి ఖాతాల్లో నగదు జమ చేయాల్సివస్తుందనే ఉద్దేశంతోనే నీళ్లివ్వకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
సొంత గడ్డకు రేవంత్ ద్రోహం: సంజయ్
పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి పురిటిగడ్డకు ద్రోహం చేస్తున్నారని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. దమ్ముంటే నీళ్లులేక ఎండిపోతున్న రైతుల పొలాల వద్దకు వెళ్లాలని సవాల్ విసిరారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

