హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇస్తే వారు సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేటీఆర్ చెప్పారు.
Cabinet has decided that Students going overseas for higher education will be given vaccination on priority so they can travel safely
— KTR (@KTRTRS) May 30, 2021
Guidelines will be issued soon with details