కరీంనగర్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో విజయఢంకా మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనిటాట్స్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులను అభినందించి, మాట్లాడారు.
ఫలితాల్లో ఎం హర్షిత్ 252వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, ఏ వర్జన్ రావు 444, పీ మనోహర్ 466, జీ శ్రీహాస్ 503, బీ భరద్వాజ్ నాయక్ 781, పీ చందన 1213, సత్యాఅమూల్యా 1301, సుభోదౌదరి 1367, కే శ్రీనిధి 1562, ఎండీ షఫిక్ 1603, మిత్ర 1612, సీహెచ్ అనూహ్య 1632, ఏ శివవరుణ్ 1719, ఎన్ ప్రణయ్ 1721, పీ రాహుల్ 1751, ఎం ప్రణీత్ రెడ్డి 1912, జే ఉమామైత్ర 1953, ఎల్ అరుణ్ కుమార్ 2353, సీహెచ్ సిద్దార్థ 2444, పీ రఘువీరారెడ్డి 2510, కే విశాల్ రెడ్డి 2557, కే రోహన్ ప్రీత్ 2643, జే హర్షవర్ధన్ 2908, జీ లహరి 2965వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని తెలిపారు.