RTO Venkanna | భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : వి.లచ్చిరెడ్డి
RTO Venkanna | భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్నను ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ : భూపాలపల్లి డీటీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న డీటీవో వెంకన్నను ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పేర్కొన్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో డీటీవో వెంకన్నపై ఇసుక లారీ దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, విధి నిర్వహణలో ఉన్న అధికారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
మృతుడి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు అవసరమైన భద్రతా చర్యలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. డీటీవో వెంకన్న అకాల మరణం పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన వి. లచ్చిరెడ్డి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

