హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 13 : ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉత్తమ్ నేతృత్వంలోని కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకుడు బండి అశోక్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలో జరిగిన సమావేశంలో ఆయన మాటాడుతూ.. వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ కమిటీతో తెలంగాణలో మాలలకు ఏ మాత్రం న్యాయం జరగదని, ఏ ఒక మాల మంత్రి లేకుం డా కమిటీని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. మంత్రు ల కమిటీలోనే మాలలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ కమిటీని రద్దు చేసి సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.