హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : కార్డు ఉన్నా, లేకున్నా లబ్ధిదారుల లిస్టులో పేరు ఉంటే రేషన్ తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడి స్పష్టంచేశారు. శుక్రవారం సెక్రటేరియట్లో సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్, అధికారులతో కలిసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఉగాది సందర్భంగా ఆదివారం హుజూర్నగర్లో రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు, 2.85 కోట్ల లబ్ధిదారులు ఉన్నట్టు వెల్లడించారు.