హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినవేళ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను 16 ఏండ్లకే సైన్యంలో చేరినట్టు గుర్తుచేశారు.
మిగ్-21 ఫైటర్ జెట్ పైలట్‌గా పనిచేశానని చెప్పుకొచ్చారు. యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే మరోసారి సైన్యంలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.