న్యూఢిల్లీ, మే 17: ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు అమెరికాలో ఉన్న ప్లాంట్‌లో అమెరికా నియంత్రణ మండలి ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతోపాటు ఫామ్ 483ని జారీ చేశారు.
న్యూయార్క్‌లో రెడ్డీస్‌కు ఉన్న ఏపీఐ యూనిట్లో ఈ నెల 12 నుంచి 16 వరకు తనిఖీలు చేసినట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.