నల్లగొండ, జూలై 26: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యూరియా అక్రమ దందా జోరుగా కొనసాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వానకాలం సీజన్ కావడంతో రైతుల నుంచి యూరియాకు డిమాండ్ పెరగడంతో మిర్యాలగూడ కేంద్రంగా హోల్‌సేల్ వ్యాపారుల ద్వారా అక్రమ దందా జోరుగా జరుగుతున్నట్టు సమాచారం. యూరియాను హోల్‌సేల్ వ్యాపారులు రిటైలర్లకు పంపిస్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఇన్వాయిస్లు, ఐడీ నంబర్లు పంపించడంలేదు. దీంతో అసలు ఈ యూరియా ఎక్కడ నుంచి వచ్చిం ది అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నది.
జిల్లా లో 11 హోల్‌సేల్ దుకాణాలు ఉండగా 1215 రిటైల్ ఫర్టిలైజర్ దుకాణాలు, ఏఆర్ఎస్కేలు ఉన్నాయి. హోల్‌సేల్ దుకాణాల నుంచి రిటైల్ దుకాణాలకు వచ్చే లోడ్లలో కొన్నింటికి ఇన్వాయిస్లు, ఐడీ నంబర్ ఇవ్వకపోవడం గమనార్హం. శాలిగౌరారం మండ లం పెర్కకొండారంలోని మహాలక్ష్మి ట్రేడర్స్ కు ఈ నెల 21న మిర్యాలగూడలోని శ్రీవెంకటరమణ ఏజెన్సీస్ నుంచి లారీలో ఎన్ఎఫ్ఆర్ఎల్జీఆర్ నీమ్కు చెందిన 150 బస్తాలు, క్రిబ్కో పీఆర్ నీమ్ 150 బస్తాలు, క్రిబ్కో జీఆర్ నీమ్ 144 బస్తాల యూరియా రాగా ఏవో, నకిరేకల్ ఏడీఏలు దాడి చేయగా సదరు లోడుకు సంబంధించి ఇన్వాయిస్, ఐడీ నంబ ర్ కనిపించలేదు.
అప్పటికే సదరు డీలర్ 53 బస్తాలను విక్రయించాడు. అదేంటని అధికారులు ప్రశ్నించగా అప్పటికప్పుడు వాట్సాప్ లో ఇన్వాయిస్ నంబర్ 830 అంటూ వెంకటరమణ వాళ్లు పంపించారు. ఐడీ చూపకపోవడంతో షాప్ క్లోజ్ చేసి ఎలాంటి ప్రొడక్ట్ అమ్మవద్దని స్టాప్ సేల్ అని రాశారు. అంతకు ముందు రోజు నకిరేకల్ మండలంలోని ఓ గ్రామంలో ఏఆర్ఎస్కే నుంచి యూరియా తెచ్చి బస్తాకు రూ.350 వరకు విక్రయిస్తున్నారని రైతులు పేర్కొన్నారు.
రిటైల్ దుకాణాలకు యూరియా సరఫరా చేసే హోల్‌సేల్ దుకాణదారులు కొన్ని షాపులకు ఇన్వాయిస్లతో పాటు ఐడీ నంబర్లు లేకుండానే సరఫరా చేస్తున్నట్టు విమర్శలు వ స్తున్నాయి. కంపెనీల నుంచి వచ్చే యూరి యా స్టాక్స్‌ను పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్)మిషన్లల్లో ఎంటర్ చేసి విక్రయించాల్సి ఉంటు ంది. అలాంటిది ఫేక్ ఇన్వాయిస్లు.. అదీనూ పట్టుబడిన సమయంలోనే ఇస్తున్నారు. ఐడీలు ఇవ్వకుండా సరఫరా చేసే యూరియా ఎక్కడ నుంచి వస్తుంది.. ఎక్కడ ప్రొడక్షన్ అవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పెర్కకొండారం విషయమై ఏవో సౌమ్యశృతిని వివరణ కోరగా మాహాలక్ష్మి ఫర్టిలైజర్స్‌కు మిర్యాలగూడలోని శ్రీవెంకటరమణ ఏజెన్సీస్ నుండి వచ్చిందని.. మేము రైడింగ్ చేసిన తర్వాత ఇన్వాయిస్ పంపారన్న ఆమె ఇంకా ఐడీ మాత్రం రాలేదన్నారు. ఈ నెల 21 నుండే స్టాప్ సేల్ రాశామని..21రోజుల్లో ఐడీ తీసుకోని రాకపోతే సీజ్ చేస్తామని అన్నారు.