రాజన్న సిరిసిల్ల : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ సోమవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కు చెల్లించుకున్నారు. వారికి రాజన్న ఆలయ అర్చకులు అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
ఉప్పల శ్రీనివాస్ దంపతులకు ఆలయ అర్చక బృందం ఆశీర్వచనంగావించారు. కార్యక్రమంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు మాడిశెట్టి కృపాల్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.