హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కోడలు ఉపాసనకు కాంగ్రెస్ సర్కారు కీలక పదవి అప్పగించింది. ఆమెను రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ కో చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. స్పోర్ట్స్ హబ్ చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించిన ప్రభుత్వం, వివిధ రంగాలకు చెందిన 12 మందిని సభ్యులుగా నియమించింది. రెండ్రోజుల క్రితం జరిగిన స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో ఉపాసన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఆదివారం నటుడు చిరంజీవి సీఎం ఇంటికి వెళ్లి కలిశారు. ఆ మరుసటి రోజే ఉపాసనకు కీలక పదవి దక్కడంపై చర్చ జరుగుతున్నది.