హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూలు అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సోమవారం జరగాల్సిన పరీక్షలను (Exams Postponed) అధికారులు వాయిదావేశారు. మంగళవారం నుంచి జరిగే పరీక్షలు యథాతథంగా జరుగుతాయిన ఓయూ పరీక్షల విభాగం స్పష్టం చేశారు. రద్దయిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామన్నారు.
బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ పరీక్షలను జేఎన్టీయూ వాయిదా వేసింది. దీంతో ఈ పరీక్షలను సెప్టెంబర్ 5న నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే మంగళవారం వర్షాలు తగ్గకపోతే, వాతావరణ పరిస్థితులను బట్టి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.