కమలాపూర్, జనవరి 9: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో 16 మంది దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు మం జూరయ్యాయి. హర్యానా నుంచి తీసుకొచ్చిన బర్రె లను ఆదివారం 10 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దళితులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వీలుగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షలు అందజేస్తున్నారని తెలిపారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గెల్లు పేర్కొన్నారు.