హైదరాబాద్ : పార్లమెంట్ అభ్యర్థుల(Parliament candidates )ఎంపికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపికను వచ్చేవారం పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ పై బీజేపీ సన్నాహాక సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం కోసం కాదు.. అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పని చేయాలన్నారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.