విద్యానగర్, జూలై 7: రాష్ట్రంలోని 26 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడా రు.
ఇతర పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలం టే తప్పనిసరిగా ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో తర్జనభర్జన పడుతున్నారని చెప్పారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధమే లేదని, మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.
ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు చేయించలేదో చెప్పాలని నిలదీశారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. ఇరు రాష్ర్టాల సీఎంలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యలకు పరిషారం దొరుకుతుందని తెలిపారు.