హైదరాబాద్, అక్టోబర్ 10 (నమ స్తే తెలంగాణ): బీజేపీవి దొంగ హామీ లు.. మోసపూరిత వాగ్దానాలని, వాటి ని గిరిజన బిడ్డలు నమ్మరని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కేంద్రమంతి అమిత్షా ఆదిలాబాద్లో చేసిన వ్యాఖ్యలపై మంగళవారం మండిపడ్డారు. గిరిజన వర్సిటీకి ప్రభుత్వం స్థలం చూపించలేదనడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
సీఎం కేసీఆర్ 2014 నుంచి వర్సిటీ ఏర్పా టు చేయాలని అనేకసార్లు ప్రధానిని కలిసి డిమాండ్ చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ములుగు జిల్లా జాకారంలో ప్రభుత్వం 335 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, అయినా 2016 నుంచి కుంటిసాకులు చెప్తూ కాలయాపన చేసింది కేంద్రం కాదా? అని నిలదీశారు. తీరా ఇప్పుడు ఎన్నికల సమయంలో వర్సిటీ ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.