హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభం, ఆహార ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అ సమానతలు తదితర సమస్యలను పరిష్కరించేలా కేంద్ర బడ్జెట్ను రూపొందింంచక పోవడం ప్రజల కొనుగోలు శక్తి క్షీణతకు దారితీస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో విలేకరులతో మా ట్లాడుతూ తాజా బడ్జెట్లో 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రకటించినా పాత విధానంలో మార్పులను ప్రస్తావించకపోవడం నష్టదాయకమేనని స్పష్టం చేశారు.