Minister KTR | యూట్యూబ్‌లో పోలిటికల్ ఇంటర్వ్యూలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు సందీష్ భాటియా (Samdish Bhatia). అన్ఫిల్టర్డ్ బై సందీష్ (Unfiltered by Samdish) అంటూ చేసే ఇతని ఇంటర్వ్యూలకు ఆన్లైన్లోనే కాదు బయట కూడా కోట్లమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఎంతోమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులని సందీష్ ఇంటర్వ్యూ చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలను స్టోరీగా తీసుకుని సందీష్ చేసే ఇంటర్వ్యూలు ఇప్పుడున్న యువతకు బాగా నచ్చుతాయి. అయితే ఇదంత మీకు ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా.! విషయం ఉందండి. సందీష్ భాటియా తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఇక ఈ ప్రోమోలో ఇండియాలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఎలా ఎదిగింది. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు, మతం గురించి కేటీఆర్ ఆలోచన, కేటీఆర్ ఇంత ఫిట్‌గా ఎలా ఉంటున్నాడు. అనే టాపిక్‌లు ఈ ఇంటర్వ్యూలో వచ్చినట్లు తెలుస్తుంది. ఇక మామూలుగానే సందీష్ వీడియోలు హ్యూమర్‌తో నిండి ఉంటాయి. ఇక సందీష్‌కి కేటీఆర్ లాంటి గ్రేట్ లీడర్ తోడవడంతో ఇంటర్వ్యూ ఎలా ఉంటుందని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.