Unemployment | నిరుద్యోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్.. నివేదికలో సంచలన విషయాలు వెల్లడి
Unemployment | కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేరాఫ్‌గా నిలిచిన తెలంగాణ.. రేవంత్‌రెడ్డి పాలనలో నిరుద్యోగానికి అడ్డాగా మారింది. నిరుద్యోగితలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలువడం రేవంత్ పాలనలో రాష్ట్రంలో చోటుచేసుకొన్న అధ్వాన పరిస్థితులకు నిదర్శనం.
Unemployment | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేరాఫ్‌గా నిలిచిన తెలంగాణ.. రేవంత్‌రెడ్డి పాలనలో నిరుద్యోగానికి అడ్డాగా మారింది. నిరుద్యోగితలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలువడం రేవంత్ పాలనలో రాష్ట్రంలో చోటుచేసుకొన్న అధ్వాన పరిస్థితులకు నిదర్శనం. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9 శాతంగా నమోదైంది. ఈ మేరకు 2025 సంవత్సరానికి గానూ ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ బజాజ్ బ్రోకింగ్ తన తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. బడ్జెట్ సమా వేశాల సందర్భంగా కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ‘ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-26’ నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడించినట్టు తెలిపింది.
యూపీ, బీహార్ కంటే అధ్వానం
‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల పాలనలో నిరుద్యోగుల గోస పుచ్చుకొం టున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షల్ని కూడా తమ ఖాతాలో వేసుకొని మొన్నటివరకూ పబ్బం గడిపిన రేవంత్ సర్కార్.. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నది.
అటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ కోతలు యువతను కుదేలు చేస్తున్నాయి. మొత్తంగా దేశంలో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో 8.9%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు బజాజ్ బ్రోకింగ్ తెలిపింది. దేశంలో నిరుద్యోగిత రేటు సగటున 5.2 శాతంగా నమోదైతే, తెలంగాణలో దేశీయ సగటు కంటే 3.7% ఎక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నట్టు వెల్లడించింది. నిరుద్యోగిత అంశంలో తెలంగాణతో పోలిస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాలు ఎంతో మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాలన్నీ అదే దారిలో..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోనూ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్టు బజాజ్ బ్రోకింగ్ గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటకలో నిరుద్యోగిత రేటు 8 శాతంగా ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో ఇది 7.9 శాతంగా రికార్డయ్యింది. సాఫ్ట్‌వేర్‌కు తానే పితామహుడినని, ఉద్యోగాల సృష్టికి తానే ఆద్యుడిగా గప్పాలకు పోయే చంద్రబాబు ఏలుబడిలోని ఏపీలో కూడా నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 8.2 శాతంగా ఉన్నట్టు రిపోర్ట్ వెల్లడించింది.
బీఆర్ఎస్ పాలనలో కొలువుల ఖిల్లా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యోగాలకు అడ్డాగా మారింది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఐఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో అతి తక్కువ నిరుద్యోగిత నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ (0.7%) నిలిచింది. అప్పుడు బీజేపీ పాలనలోని హర్యానాలో నిరుద్యోగిత రేటు ఏకంగా 23.4% రికార్డవ్వడం గమనార్హం. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో మరో 24 లక్షల ఉద్యోగ కల్పన చేపట్టింది. వెరసి మొత్తంగా 26.3 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్టయ్యింది. అలా కేసీఆర్ పాలనలో దక్షిణ భారతదేశంలో ఉపాధి కల్పనలో తెలంగాణ తొలి ర్యాంకును సాధించగా, దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని కైవసం చేసుకొన్నది. పురుషులకు సంబంధించి ఉద్యోగాల్లో దేశంలోనే తెలంగాణ రెండో ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో), పిరియాడిక్ లేబర్ ఫోర్స్ గత నివేదికల్లో వెల్లడించాయి. అయితే, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వ విధానాలతో ఉద్యోగాలు లేక యువత కకావికలమవుతున్నదని తెలంగాణవాదులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల భర్తీ
- తొమ్మిదిన్నరేండ్లలోఇచ్చినవి-2,32,308
- ఏడాదికి సగటున ఇచ్చినవి -24,453
- నెలకు సగటున ఇచ్చినవి-2,037
- రోజుకు సగటున ఇచ్చిన ఉద్యోగాలు-68
కాంగ్రెస్ పాలనలో..
- రెండున్నరేండ్లలో ఇచ్చినవి -16,978
- ఏడాదికి సగటున ఇచ్చినవి -6,791
- నెలకు సగటున ఇచ్చిన ఉద్యోగాలు-566
- రోజుకు సగటున ఇచ్చిన ఉద్యోగాలు-19
18 గంటల పని ఇదేనా?
రోజుకు 18 గంటలు నిర్విరామంగా పనిచేస్తానంటూ చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. బజాజ్ బ్రోకింగ్ గణాంకాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దావోస్ పర్యటన, ఏఐ సమ్మిట్, ఫ్యూచర్ సిటీ పేరిట మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగాలు సున్నా అంటూ దుయ్యబట్టారు. 2022లో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు అత్యల్పంగా 0.7 శాతంగా నమోదైతే, ఇప్పుడు ఏకంగా 8.9 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు ఈ స్థాయిలో పెచ్చరిల్లలేదని విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో
- దక్షిణ భారత దేశంలో ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంకు 1
- పురుషుల ఉద్యోగాల్లో దేశంలో తెలంగాణ ర్యాంకు 2
- ఉద్యోగ, ఉపాధి కల్పనలో మొత్తంగా తెలంగాణ ర్యాంకు 3
కాంగ్రెస్ 2.5 ఏండ్ల పాలనలో
- నిరుద్యోగం ఎక్కువున్న రాష్ర్టాల్లో తెలంగాణ ర్యాంకు-1
- తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9%
- దేశ సగటు కంటే ఎక్కువగా ఉన్న నిరుద్యోగిత రేటు-3.7%
దేశంలో నిరుద్యోగిత రేటు ఇలా..
- తెలంగాణ = 8.9
- ఆంధ్రప్రదేశ్ = 8.2
- కర్ణాటక = 8.0
- హిమాచల్ = 7.9
- పంజాబ్ = 7.4
- బీహార్ = 5.2
- జమ్ముకశ్మీర్ = 4.3
- ఉత్తరప్రదేశ్ = 3.7
- కేరళ = 3.7
- జార్ఖండ్ = 2.8

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

