KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
KTR | చావుతో సహవాసం చేసే సత్తా ఉన్న కార్మిక సోదరులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నరా.. అంటే మన సంగిరేణిలోనే ఉన్నరని గర్వంగా చెప్పుకోవచ్చునని సింగరేణి కార్మిక గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | వచ్చేటప్పుడు కరీంనగర్లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ బాబు ఆపితే అక్కడ కొద్దిసేపు ఆగిన. ఏం సంగతి ఏమో గడ్డం పెంచినవ్ అని అడిగిండు. పోయేదెక్కడికి గోదావరి ఖనికి.. ఆ మాత్రం ఉండాలే కదా అని చెప్పిన. పోయేది సింగరేణికి కదా ఆ మాత్రం ఉండాలే.. లేకపోతే నడువదు అని చెప్పిన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో ’సింగరేణి కార్మిక గర్జన’లో కేటీఆర్ మాట్లాడుతూ.. పోరాటాల పురిటి గడ్డ రామగుండం అంటేనే రణగర్జన చేసే రణరంగం ఈ గడ్డ. నల్లబంగారు గనుల నుంచి తరలివచ్చిన మా కార్మిక అన్నలందరికీ హృదయపూర్వక వందనం. చెమట, నెత్తురు దారపోసి ఈ దేశానికి విద్యుత్ అందించి వెలుగులు ప్రసరించే విధంగా కష్టపడుతున్న ప్రతీ కార్మిక సోదరుడికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
సింగరేణిది 137 ఏండ్ల చరిత్ర. ఈ నాటిది కాదిది. కార్మికుల త్యాగముఉన్నది.. కార్మికుల కష్టమున్నది. నల్లబొగ్గుకు నెత్తురు అద్ది ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులున్నారు. అవిటివాళ్లైన వాళ్లున్నరు. చీకటి గుహల్లో రక్తతర్పనం చేసినవాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసినవాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసిన వేలాది కార్మికుల కుటుంబాలున్నాయి. చావుతో సహవాసం చేసే సత్తా ఉన్న కార్మిక సోదరులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నరా.. అంటే మన సంగిరేణిలోనే ఉన్నరని గర్వంగా చెప్పుకోవచ్చునన్నారు.
మీకు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు.. ఉద్యమాలను ఉత్పత్తి చేయడం కూడా బ్రహ్మాండంగా తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు. మీ అందరికీ, మా అందరికీ గుర్తుంది. ఉత్పత్తిలో మొనగాళ్లు, ఉద్యమాల్లో కూడా మొనగాళ్లు మీరు. ఆనాడు బాగా యాదికుంది.. కేసీఆర్ పిలుపునిస్తే సకలజనుల సమ్మెలో 35 రోజులపాటు ఒకసారి, 7 రోజులు ఒకసారి 42 రోజులపాటు ఒక్క బొగ్గు పెళ్ల రాకుండా మీరు ఆరోజు తిరగబడితే మొత్తం దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయిన మాట ఎవరూ మరిచిపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ రోజుల కేసీఆర్ తెలంగాణ జెండా ఎగరేసి బయలుదేరితే ఆయనకు అండగా నిలబడ్డది.. ఇదే సింగరేణి కార్మిక లోకమనే మాట మేమెవరం మరిచిపోలేదు. ఆ రోజు కేసీఆర్ కో అంటే మీరు కోల్ బెల్ట్ మొత్తంకో అని బయలుదేరారన్నారు.
కేసీఆర్తో కలిసి కదం తొక్కిన సింగరేణి కార్మికులు..
సింగరేణి సై అంట సై అన్నది . జంగ్ సైరన్ కేసీఆర్ ఊదితే 42 రోజులపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిని గడగడ లాడించింది మా సింగరేణి కార్మికులు అని కేటీఆర్ స్పష్టం చేశారు. మీ త్యాగాన్ని ఒక్కరూ కూడా మరిచిపోలేదు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. 11 రోజులు చావు నోట్లో తలపెట్టైనా సరే తెలంగాణ తెస్తా అని ఆనాడు కేసీఆర్ బయలుదేరితే 7 రోజులపాటు సింగరేణి కార్మికులు ఆయనతో కలిసి కదం తొక్కారనే విషయాన్ని మేమెవరం మరిచిపోలేదన్నారు. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కార్మిక సోదరులు బోనస్ కోసం ఉద్యమాలు చేస్తారు.. తమ జీతాల కోసం ఉద్యమాలు చేస్తరు.. హక్కుల కోసం ఉద్యమాలు చేస్తారు.. కానీ ఒకే ఒక్క గడ్డ తెలంగాణ… ఇక్కడ మాత్రమే తమ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన కార్మికులున్న ఒకే ఒక్క గడ్డ తెలంగాణ. ఆ గడ్డ గోదావరి ఖని అని నేను గర్వంగా చెబుతున్నానన్నారు.
LIVE: బీఆర్ఎస్ “సింగరేణి కార్మిక గర్జన”
📍సింగరేణి స్టేడియం, గోదావరిఖని https://t.co/wXBYAIQD5o
— BRS Party (@BRSparty) October 14, 2026
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

