IND vs NZ | టాప్ ఆర్డర్ వైఫల్యం.. 209 పరుగులకే భారత్ ఆలౌట్!
IND vs NZ | న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో టీమిండియా 209 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 42.1 ఓవర్లలోనే ఆలౌటైంది. భారత టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపర్చగా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ మాత్రమే కివీస్ బౌలర్లను ప్రతిఘటించారు.
IND vs NZ | న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో టీమిండియా 209 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 42.1 ఓవర్లలోనే ఆలౌటైంది. భారత టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపర్చగా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ మాత్రమే కివీస్ బౌలర్లను ప్రతిఘటించారు.
ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. రుతురాజ్ గైక్వాడ్ 18 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ 46 పరుగుల చొప్పున సాధించారు. అక్షర్ 55 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేయగా.. ఇషాన్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే ఔటవడంతో భారత్ మళ్లీ ఒత్తిడిలో పడింది.
చివర్లో అర్ష్‌దీప్ సింగ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. జాకబ్ డఫీ వేసిన 41వ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్, రెండు పరుగులు, మరో సిక్స్ బాదాడు. కేవలం 4 బంతుల్లోనే 14 పరుగులు సాధించాడు. అయితే 42.1వ ఓవర్లో డఫీ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. మహమ్మద్ సిరాజ్ 20 బంతుల్లో 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు పడగొట్టగా, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్ కీలక వికెట్లు తీశారు. దీంతో భారత్ 209 పరుగులకే ఆలౌటైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | టాప్ ఆర్డర్ వైఫల్యం.. 209 పరుగులకే భారత్ ఆలౌట్!
Jawaharlal Nehru | మాజీ ప్రధాని నెహ్రూతో షర్మిలా, పటౌడీల చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న సోహా అలీ ఖాన్!
రూ.4.66 లక్షల జరిమానా కడితేనే స్వదేశానికి.. ఆరున్నరేళ్లుగా సౌదీలో చిక్కుకుపోయిన వేములవాడ వాసి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి శ్వేతా నాయుడు ఔట్.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లింది ఆమెనేనా?
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయ క్యూలైన్ వద్ద అగ్నిప్రమాదం.. భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

