Jawaharlal Nehru | మాజీ ప్రధాని నెహ్రూతో షర్మిలా, పటౌడీల చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న సోహా అలీ ఖాన్!
Soha Ali Khan | చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నటి సోహా అలీ ఖాన్ తన కుటుంబానికి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నటి సోహా అలీ ఖాన్ తన కుటుంబానికి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఆమె తన తల్లిదండ్రులైన ప్రముఖ నటి షర్మిలా టాగోర్, మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (టైగర్ పటౌడీ)ల చిన్ననాటి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో వారు ఉన్న ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక ఫోటోలో చిన్నారి షర్మిలా టాగోర్ నెహ్రూ కోటుకు ఏదో పిన్ చేస్తుండగా, మరో ఫోటోలో ఆల్ ఇండియా రేడియో వద్ద ఆయన పక్కన నిలబడి కనిపిస్తున్నారు. మూడో ఫోటోలో చిన్న వయసులో ఉన్న టైగర్ పటౌడీ మాజీ ప్రధాని పక్కన కూర్చుని ఉన్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సోహా అలీ ఖాన్ భావోద్వేగపు వ్యాఖ్యలు రాశారు. “నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులుగా మారడానికి ముందు వాళ్ళు కూడా చిన్నారులే. నేడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా మా కుటుంబ ఆల్బమ్ నుండి కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నాను” అని తెలిపారు.
చిన్నారులే దేశ భవిష్యత్తు అని నమ్మిన గొప్ప నాయకుడితో తన తల్లిదండ్రులు చిన్నతనంలో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ, పిల్లలందరికీ వారి కలలను నిజం చేసుకునే అవకాశం దక్కాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్క చిన్నారికి సమాన అవకాశాలు లభించాలని కోరుతూ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
View this post on Instagram
ఇదే సమయంలో షర్మిలా టాగోర్, టైగర్ పటౌడీల ప్రేమకథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 1965లో ఒక ఆఫ్-మ్యాచ్ పార్టీలో మొదటిసారి కలుసుకున్న వీరు, సుమారు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని 1968లో వివాహం చేసుకున్నారు. వీరికి సైఫ్ అలీ ఖాన్, సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ ముగ్గురు సంతానం కాగా, టైగర్ పటౌడీ 2011లో కన్నుమూశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jawaharlal Nehru | మాజీ ప్రధాని నెహ్రూతో షర్మిలా, పటౌడీల చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న సోహా అలీ ఖాన్!
రూ.4.66 లక్షల జరిమానా కడితేనే స్వదేశానికి.. ఆరున్నరేళ్లుగా సౌదీలో చిక్కుకుపోయిన వేములవాడ వాసి!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10 నుంచి శ్వేతా నాయుడు ఔట్.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లింది ఆమెనేనా?
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయ క్యూలైన్ వద్ద అగ్నిప్రమాదం.. భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు!
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. టీజర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

