రూ.4.66 లక్షల జరిమానా కడితేనే స్వదేశానికి.. ఆరున్నరేళ్లుగా సౌదీలో చిక్కుకుపోయిన వేములవాడ వాసి!
ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ తెలంగాణ వాసి ఆరున్నరేళ్లుగా అక్కడే చిక్కుకుపోయాడు. సొంతూరికి తిరిగొద్దామన్నా చేతిలో చిల్లిగవ్వ లేక.. సౌదీ ఆరేబియా విధించిన రూ.4.66 లక్షల జరిమానా చెల్లించలేక రియాద్‌లోనే ఉండిపోవాల్సి వస్తోంది.
ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ తెలంగాణ వాసి ఆరున్నరేళ్లుగా అక్కడే చిక్కుకుపోయాడు. సొంతూరికి తిరిగొద్దామన్నా చేతిలో చిల్లిగవ్వ లేక.. సౌదీ ఆరేబియా విధించిన రూ.4.66 లక్షల జరిమానా చెల్లించలేక రియాద్‌లోనే ఉండిపోవాల్సి వస్తోంది. కుటుంబానికి దూరంగా పరాయి దేశంలో ఎన్నో ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. దీంతో తన భర్తను ఎలాగైనా స్వదేశానికి రప్పించి కుటుంబంతో కలపాలని భార్య తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి-తెట్టకుంట గ్రామానికి చెందిన సూర యాదగిరి ఉపాధి కోసం 2020 మార్చిలో సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లాడు. అక్కడ యజమానితో ఏర్పడిన సమస్యల కారణంగా ఎనిమిది నెలలకే ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. దీంతో అతనిపై ‘హురూబ్’ (పరారీ) కేసుతో పాటు ఉద్యోగ ఒప్పంద ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ కార్మిక వివాదంలో సౌదీ కోర్టు 18,700 రియాళ్లు (సుమారు రూ.4.66లక్షలు) జరిమానా విధించినట్లు ఆయన భార్య నిర్మల తెలిపారు.
ఉద్యోగం వదిలేసిన తర్వాత తన భర్తపై నమోదైన కేసులు, జరిమానా కారణంగా స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారని నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆరున్నరేళ్లు గడిచిపోయాయని, భర్త తిరిగి వస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. కార్మిక, న్యాయ, ఇమ్మిగ్రేషన్ సంబంధిత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆయన సౌదీలోనే ఉండిపోవాల్సి వస్తోందని వివరించారు.
ప్రజావాణిలో భార్య విజ్ఞప్తి
తన భర్తను స్వదేశానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నిర్మల కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన 269వ విడత ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో వినతిపత్రం సమర్పించారు. తన భర్తపై నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని, కార్మిక, న్యాయ, ఇమ్మిగ్రేషన్ సమస్యల పరిష్కారానికి సహకరించాలని సీఎం ప్రవాసీ ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డిలను కోరారు. వారు సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.4.66 లక్షల జరిమానా కడితేనే స్వదేశానికి.. ఆరున్నరేళ్లుగా సౌదీలో చిక్కుకుపోయిన వేములవాడ వాసి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి శ్వేతా నాయుడు ఔట్.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లింది ఆమెనేనా?
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయ క్యూలైన్ వద్ద అగ్నిప్రమాదం.. భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు!
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. టీజర్ విడుదల!
Hyderabad | ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందనే సూసైడ్.. కేపీహెచ్‌బీ దంపతుల మృతిలో కొత్త కోణం!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

